మూడు రైళ్ల ప్రయాణ సమయవేళలను మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో లింగంపల్లి టు తిరుపతి వరకు ప్రయాణించే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ టు తిరుపతి వరకు ప్రయాణించే పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ టు గూడురు ప్రయాణించే సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళలను మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక, ఈ మార్పును గమనించాలని ప్రయాణికులను కోరింది. వీటి పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ..
12734 అనే నెంబర్‌గల లింగంపల్లి నుంచి తిరుపతి వరకు ప్రయాణించే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణించే వేళల్లో పలు మార్పులు చేశారు. ఈ ట్రైన్ లింగంపల్లిలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, సికింద్రాబాద్ స్టేషన్‌కు కు సాయంత్రం 6.05 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి నడికుడిరి రాత్రి 8.34 గంటలకు, పిడుగురాళ్లకు రాత్రి 8.54 గంటలకు, సత్తెనపల్లికి రాత్రి 9.22 గంటలకు, గుంటూరుకు రాత్రి 10.55 గంటలకు చేరుకుంటుంది. తెనాలికి రాత్రి 11.38 గంటలకు చేరుకోగా, బాపట్ల స్టేషన్‌కు అర్ధరాత్రి 12.14 గంటలకు చేరుకుంటుంది.
అదే చీరాలకయితే అర్ధరాత్రి 12.29 గంటలకు, ఒంగోలుకు అర్ధరాత్రి 1.13 గంటలకు, సింగరాయకొండకు అర్ధరాత్రి 1.34 గంటలకు, కావలికి అర్ధరాత్రి 2.04 గంటలకు, నెల్లూరుకు అర్ధరాత్రి 2.28 గంటలకు చేరుకుంటుంది. గూడురుకు తెల్లవారుజామున 3.34 గంటలకు, వెంకటగిరికి తెల్లవారుజామున 4.18 గంటలకు, శ్రీకాళహస్తికి తెల్లవారుజామున 4.38 గంటలకు, రేణిగుంటకు తెల్లవారుజామున 5.08 గంటలకు, తిరుపతి స్టేషన్‌కు ఉదయం 5.55 గంటలకు చేరుకుంటుంది.
పద్మావతి ఎక్స్‌ప్రెస్…
ఇక, 12764 అనే నెంబర్‌గల సికింద్రాబాద్ టు తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణించే వేళల్లో కూడా మార్పులు చేశారు. ఈ ట్రైన్ తెల్లవారుజామున 4.19 గంటలకు గూడురుకు, ఆ తర్వాత ఉదయం 5.09 గంటలకు వెంకటగిరికి, శ్రీకాళహస్తి ఉదయం న 5.29 గంటలకు చేరుకుంటుంది. ఉదయం 5.58 గంటలకు రేణిగుంటకు, తిరుపతి స్టేషన్‌కు ఉదయం 6.55 గంటలకు చేరుకుంటుంది. ఆ రకంగా సమయవేళల్లో మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు గూడురు మధ్య ఎటువంటి మార్పు లేదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు.
సింహాపురి ఎక్స్‌ప్రెస్..
12710 అనే నెంబర్‌గల సికింద్రాబాద్ టు గూడురు సింహాపురి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణించే వేళల్లో కూడా మార్పులు చేశారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో రాత్రి 10.05 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ స్టేషన్‌కు తెల్లవారుజామున 3.35 గంటలకు, తెనాలికి తెల్లవారుజామున 4.19 గంటలకు, బాపట్లకు తెల్లవారుజామున 4.59 గంటలకు, చీరాల స్టేషన్‌కు ఉదయం 5.19 గంటలకు, ఒంగోలు స్టేషన్‌కు ఉదయం 5.58 గంటలకు, సింగరాయకొండ స్టేషన్‌కు ఉదయం 6.19 గంటలకు చేరుకుంటుంది.
ఆత ర్వాత కావలి స్టేషన్‌కు ఉదయం 6.59 గంటలకు, బిట్రగుంట స్టేషన్‌కు ఉదయం 7.19 గంటలకు చేరుకుంటుంది. నెల్లూరు స్టేషన్‌కు ఉదయం 7.58 గంటలకు, వేదయపాలెం స్టేషన్‌కు ఉదయం 8.05 గంటలకు చేరుకుంటుంది. గూడురు స్టేషన్‌కు ఉదయం 8.55 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు చేసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది.