- పరస్పర అవగాహన కోసం ఏటా కార్యక్రమం
- ఉత్సాహంగా సాగిన అలయ్‌బలయ్
- పాల్గొన్న చిరంజీవి తదితరులు
- ఆకట్టుకున్న తెలంగాణ వంటకాలు
హైదరాబాద్,అక్టోబర్6(ఆంధ్రపత్రిక): మనుషుల మధ్య స్నేహం విస్తరించాల ని, మనసుల్లో కల్మషం తొలగాలన్న సంకల్పంతోనే ఏటా అలయ్ బలయ్నిర్వ హిస్తున్నట్లు హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ ప్రకటించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటే కల్మషాలు తొలగిపోతయాని అన్నారు. అంతదరం ఒక్కటే..అందరం కలసి ఉండాలన్న సంకల్పంఓతనే దీనిని చేపట్టామని అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్.. బలయ్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు. సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 2005 నుంచి ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కులమతాలు, వర్గాలకు అతీతంగా నిర్వహిస్తున్న గొప్ప సమ్మేళనం ’అలయ్ బలయ్’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అలయ్.. బలయ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రేమ, సోదరాభావం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చిరు పిలుపునిచ్చారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు హీరో చిరంజీవి హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు మొదలుపెట్టే సమయంలో చిరంజీవి ఫోటోలు దిగేందుకు వెళ్లారు. అందరూ చిరంజీవినే గమనిస్తుండడంతో గరికపాటి స్పందించారు. ‘చిరంజీవి గారూ.. విూ ఫోటో సెషన్ ఆపేయండి.. లేదంటే నాకు సెలవియ్యండి‘ అని వ్యాఖ్యానించారు. దీంతో అందరి దృష్టి గరికపాటిపై పడిరది. అంతకుముందు.. గరికపాటికి చిరంజీవి, దత్తాత్రేయ కలిసి సన్మానం చేశారు. బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను దత్తాత్రేయ
కుమార్తె బండారు విజయలక్ష్మి తీసుకున్నారు. స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. బండారు విజయలక్ష్మి ఆహ్వానాన్ని మన్నించిన చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాలకు స్పందించిన చిరంజీవి డోలు కొట్టారు. చిరంజీవి ఉత్సాహం కార్యక్రమాన్ని మరింత హుషారెత్తించింది. దసరా సందర్భంగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఇతివృత్తంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా తీయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ కోరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ మంచి సంస్కృతి సంప్ర దాయాలు కలిగిన రాష్ట్రం అని అన్నారు. దత్తన్న ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమం అద్భుతం అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు నుండి మనం ప్రేరణ పొందాలని సూచించారు. మన వాళ్లనే కాదు అందరిని ప్రేమించాలనే తత్వం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని వివరించారు. మనుసులంతా ఒక్కటే అని సిద్దాంతాన్ని అందరూ పాటించాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ కోరారు. కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి కొంచెంసేపు డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. అయితే అలయ్ బలయ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. కళాకారులతో కలిసి డప్పు వాయించారు. పోతురాజులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు బండారు దత్తాత్రేయ. మరోవైపు అలయ్ బలయ్‌లో మాజీ ఎంపీ వీహెచ్ సందడి చేశారు. అలయ్`బలయ్‌కి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డప్పు వాయిస్తూ కాసేపు సందడి చేశారు. పోతరాజులతో కలిసి స్టెప్పులేశారు. కళాకారులతో కలిసి ఉత్సాహంగా డబ్బులు వాయించారు. పోతురాజులతో కలిసి డాన్స్ చేశారు. ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ చేపట్టగా తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. దసరా సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బండారు దత్తాత్రేయ. దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా పలు రకాల కళాకారులు అలయ్ బలయ్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.