డిసెంబర్ 07 (ఆంధ్రపత్రిక): బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న మరాఠి చిత్రం శివాజీ. పీరియాడిక్ ఫిల్మ్‌గా వస్తున్న ఈ చిత్రానికి మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. లెజెండరీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. కాగా మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజసం ఉట్టిపడేలా శివాజీ మహరాజ్ కాస్ట్యూమ్స్‌లో నడుచుకుంటూ వస్తున్న వీడియోను అక్షయ్‌కుమార్ సోషల్ విూడియాలో షేర్ చేశారు. అయితే, అక్షయ్ తన పాత్రను రివీల్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత్రకు అక్షయ్‌కి బదులు ప్రముఖ టీవీ నటుడు శరద్ కేల్కర్‌ను తీసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అతనైతే ఈ పాత్రకు కరెక్ట్‌గా సూట్ అవుతాడంటూ కామెంట్ల రూపంలోతమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. నెటిజన్ల విజ్ఞప్తులతో శరద్ కేల్కర్ పేరు ప్రస్తుతం ట్రెండిరగ్‌లో ఉంది. కాగా, శరద్ కేల్కర్.. 2020లో వచ్చిన హిందీ చిత్రం ’తానాజీ’లో నటించారు. ఆ చిత్రంలో శరద్ ఛత్రపతి శివాజీ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. టి`సిరీస్ ఫిలిమ్స్, అజయ్ దేవగన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్, భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గణ్, కాజోల్, జగపతి బాబు, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 జనవరి 2020న విడుదలైంది. మరికొందరైతే.. ’అక్షయ్.. ఇప్పటికే పృథ్వీ రాజ్ చౌహాన్ పాత్రను చెడగొట్టావు.. ఇప్పుడు మరో చారిత్రక పాత్రను పాడు చేస్తావా ఏంటి..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్ నటించిన ’సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రం ఈ ఏడాది జూన్ 3న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చందప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ మూవీ.. రాజపుత్ర చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, కాలాల ఆధారంగా తెరకెక్కించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!