నవంబర్ 25 (ఆంధ్రపత్రిక): నందమూరి అభిమానులను ఖుషీ చేసే అప్డేట్ వచ్చేసింది. బాలకృష్ణ కెరీర్లో వన్ ది స్పెషల్ మూవీగా నిలిచింది అఖండ. ఈ బ్లాక్ బస్టర్ మూవీ గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో స్క్రీనింగ్ అయింది. ఈవెంట్లో సినిమా హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ ముగ్గురు థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ చిత్రంలో బాలకృష్ణ డ్యుయల్ రోల్లో నటించాడు. అఖండ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎస్ఎస్.థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ విజయంలో కీ రోల్ పోషించింది. ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా.. శ్రీకాంత్, పూర్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న చలన చిత్రత్సోవాలు ముగియనున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!