నవంబర్ 18 (ఆంధ్రపత్రిక):bఈమధ్య కాలంలో తెలుగు హీరోల అభిమానులతో పోల్చితే తమిళ స్టార్ హీరోల అభిమానుల అరాచకాలు మరీ దారుణంగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానులు వర్సెస్ అజిత్ అభిమానులు అన్నట్లుగా సోషల్ మీడియాలో పరిస్థితి వాడి వేడిగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది పొంగల్‌కి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాతో పాటు అజిత్ నటిస్తున్న సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల విడుదల హడావుడి మొదలు కాకుండానే అభిమానుల యొక్క సోషల్ మీడియా హడావుడి మొదలుఅయ్యింది. మా హీరో పొంగల్ విజేత అంటే మా హీరో పొంగల్ విజేతా అన్నట్లుగా గొడవలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పొంగల్ సినిమాల ప్రమోషన్స్ జరగాల్సిన ఈ సమయంలో సోషల్ విూడియాలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో సినిమాలకు జరగబోతున్న డ్యామేజీని తల్చుకుని ఆయా సినిమాల యొక్క నిర్మాతలు మరియు దర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో హీరో అజిత్ అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మనం బతకడంతో పాటు అవతలి వారిని కూడా బతకనిద్దాం. నెగెటివిటీ వద్దు.. సోషల్ విూడియాలో డ్రామా వద్దు.. విూ చుట్టు కూడా మిమ్ములను ప్రోత్సహించే వారిని పెట్టుకోండి. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించండి అంటూ అజిత్ ఫ్యాన్స్ కు హిత భోద చేయడం జరిగింది. అభిమానులకు అజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు కచ్చితంగా పాజిటివ్ గా రీచ్ అవుతాయని.. దాంతో ఇప్పటి వరకు వారు విజయ్‌పై చేసిన విమర్శలు తగ్గే అవకాశాలు ఉన్నాయని.. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు తగ్గుతాయని.. అలాగే ఇక నుండి స్నేహపూర్వక వాతావరణం ఉండాలంటే విజయ్ ఫ్యాన్స్ కూడా పద్ధతిగా ఉండాలని తమిళ ఇండస్టీ వర్గాల వారు అంటున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!