నవంబర్ 01 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ అగ్ర దర్శకుడు తాజాగా మహేష్‌తో చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడట. ఈ నేపథ్యంలో కాస్టింగ్ విషయంలో అస్సలు తగ్గడం లేదట. మాములుగానే త్రివిక్రమ్ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాలలో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే మలయాళి భామ ఐశ్వర్య లక్ష్మీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇటీవలే ’పొన్నియన్ సెల్వన్’తో మంచి విజయం సాధించిన ఈ బ్యూటీను తివిక్రమ్ నెగెటీవ్ రోల్ కోసం ఎంపిక చేయనున్నాడట. ఈ సినిమాలో ఐశ్వర్య పాత్ర టోటల్‌గా నెగెటీవ్ షేడ్స్‌తోనే ఉండనుందట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక/ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడట.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!