ఢిల్లీని కాలుష్యం వెంటాడుతూనే ఉంది. అసలే చలికాలం దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీనికి తోడూ చుట్టుపక్కల నుంచి వస్తున్న విషవాయువులు ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. మన్నటి వరకూ వాయువుల వేగంతో పాటూ గాలి దిశ మార్పుతో కొంత వరకూ ఉపశమనం లభించింది.
ఢిల్లీని కాలుష్యం వెంటాడుతూనే ఉంది. అసలే చలికాలం దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీనికి తోడూ చుట్టుపక్కల నుంచి వస్తున్న విషవాయువులు ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. మన్నటి వరకూ వాయువుల వేగంతో పాటూ గాలి దిశ మార్పుతో కొంత వరకూ ఉపశమనం లభించింది. దీంతో కాలుష్యతీవ్రత కొంత మేర తగ్గిందని భావించారు స్థానికులు. దీంతో అధికారులు కొన్నింటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.
ప్రస్తుతం గాలిలో ఉధృతి ఏర్పడి అది కాలుష్యానికి కారణం అవుతోంది. తద్వారా విజిబులిటీ సమస్య తీవ్రంగా మారింది. మంగళవారం ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగా నమోదైంది. మధ్యాహ్నం 2గంటలకే రహదారులు కనిపించకుండా మసగగా మారిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో సూర్యరశ్మి బలహీనంగా మారింది. సాధారణంగా 2వేల మీటర్ల వరకూ కనిపించే రహదారి.. ప్రస్తుతం 1000 నుంచి 1500 మీటర్ల పరిధిలోనే కనిపిస్తోంది. దీనిపై స్పందించిన సెంట్రల్ పొల్యూషన్ బోర్డు కొన్ని కీలక అంశాలను వెల్లడించింది.
సాధారణం కంటే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైనట్లు ప్రకటించింది. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 11.5గా నమోదైనట్లు వెల్లడించింది. గాలిలో తేమ భారీగా పడిపోయింది. రెండు రోజుల క్రితం 95శాతం ఉండగా నిన్న 56శాతం ఉన్నట్లు పేర్కొంది. చుట్టుపక్కల నెలకొన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, దట్టమైన పొగ కారణంగా మరిన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. అప్పుడప్పుడూ వేడి నీళ్లతో ఆవిరి పట్టుకొవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.