నవంబర్ 03 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం ’హిట్ 2’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుండి తాజాగా టీజర్ ను వదిలారు. టీజర్ లో పోలీస్ ఆఫీసర్‌గా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌లో అడివి శేష్ కనిపిస్తున్నాడు. ఒక యువతి మర్డర్ కేసును పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ ఎలా ఛేదించాడు అనేదే కథ. సరిగ్గా ఆ పాయింటు పైనే టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తినిరేపుతోంది. గతంలో విష్వక్సేన్ హీరోగా ’హిట్’ సినిమాను నిర్మించిన నాని, ఆ సిరీస్ లో భాగంగా ’హిట్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. జాన్ స్టీవర్ట్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. అడివి శేష్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించగా,రావు రమేశ్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!