ప్రపంచ స్థాయి ఆదివాసీ దినోత్సవం జిల్లా స్థాయి వేడుకల్లో మాట్లాడుతున్న కృష్ణాజిల్లా డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు.
విద్య ద్వారానే నాగరిక సమాజంలో తమ హక్కులను ఉనికిని ఆదివాసీలు కాపాడుకోవాలి..!
డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు..! మచిలీపట్నం ఆగస్టు 9 ఆంధ్ర పత్రిక..!
ఆదివాసీలు నేటికీ అనేకరంగాల్లో వెనకబాటులోనే ఉన్నారని, విద్య ద్వారానే నాగరిక సమాజంలో కలిసి తమ హక్కులను ఉనికిని కాపాడుకోగలుగుతారని కృష్ణాజిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
బుధవారం మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలన అనంతరం భారతరత్న డా. బీ. ఆర్. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, చెంచులక్ష్మి , సంత్ సేవాలాల్ మహారాజ్, వెన్నెలకంటే రాఘవయ్య తదితర మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
మైలవరం గురుకుల పాఠశాల బాలికలు బంజారా నృత్యంతో, ఉయ్యూరు గురుకుల పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది
అనంతరం ఉయ్యురు గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. కృష్ణమోహన్ ఆదివాసీ దినోత్సవం గూర్చి సంక్షిప్త వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కల ప్రకారం కృష్ణాజిల్లాలో 17. 35 లక్షల మంది ప్రజలు ఉంటే, అందులో గిరిజనులు 35 లక్షల మంది ఉన్నారని చెప్పారు. గిరిజనులు తమ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణలో ఆదివాసీల పాత్ర, కృషి ఫలితం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.
కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన ఆర్ధిక సంస్థ (ఎస్.టి.కార్పొరేషన్) ద్వారా 2022-23 సంవత్సరంలో గిరిజనాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికను క్లుప్తంగా డిఆర్ఓ వివరించారు.
జగనన్న విద్యా కానుక : 2023-24 సంవత్సరమునకు (స్కూల్ బ్యాగ్ . 3 జతలు దుస్తులు నోటు పుస్తకాలు & టెస్ట్ పుస్తకాలు, బెల్టు, 1 జత షస్ మరియు 2 జతలు సాక్స్ లు ఇవ్వబడుచున్నది. మెట్రిక్ అనంతర ఉపకార వేతనములు (వై.యస్.ఆర్. నవశకం): 2022-23 వ సంవత్సరము నందు జగనన్న విద్యా దీవెన ( ఫీజు రీయంబర్స్ మెంట్ ) క్రింద 528 మందికి గాను 144.08 లక్షలు జగనన్న వసతి దీవెన (మెయింట్ నెన్స్) క్రింద 500 మందికి గాను 91.90 లక్షలు వారి తల్లుల ఖాతాలకు జమ చేయడమైనదని తెలిపారు.ఉచిత విద్యుత్ పథకం (200 లోపు యూనిట్స్): 2022-23 వ సంవత్సరము నందు 8229 మంది.
లబ్దిదారులకు గాను 2.52 కోట్లు చెల్లించినట్లు తెలిపారు
అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఫణి దూర్జిటి మాట్లాడుతూ, జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఎరుకుల, లంబాడీ, యానాది వర్గాల వారి అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు.
గృహ నిర్మాణాలు : జగనన్న గృహ నిర్మాణముల నిమిత్తము ప్రత్యేకముగా సర్దుబాటు క్రింద వివిధ మండలాలలో ని 60 మందికి గాను 37.80 లక్షలు మంజూరు చేయటం జరిగిందన్నారు. పామర్రు మండలంలో అగ్ని బాధిత 4 కుటుంబాలకు గృహ నిర్మాణము, వంట సామాగ్రి నిత్య అవసర వస్తువుల కొరకు 1.27 లక్షలు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. గృహ మర మ్మత్తులు: యానాది, ఎరుకుల గిరిజన గృహాలు పూర్తిగా నివాస యోగ్యముగా లేనందున వాటి మరమ్మత్తుల నిమిత్తం మచిలీపట్నం, చల్లపల్లి, పెనమలూరు కృత్తివెన్ను మండలాలలో 218 మందికి 11035 లక్షలు మంజూరు చేయటం జరిగిందన్నారు. మినీట్రక్ పధకం క్రింద 5 గురు లబ్దిదారులకు గాను 26.15 లక్షలు మంజూరు చేయటం జరిగిందని, అలాగే 28 మంది హెచ్.ఐ.వి లబ్దిదారులకు గాను 28.00 లక్షలు రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. చేపల పంజరాలు ఏర్పాటుకు గాను . 5.00 లక్షలు రూపాయలు మంజూరు చేయటం జరిగింది.18 మంది గిరిజన లబ్దిదారులకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా హెవీ వెహికల్ శిక్షణకు గాను ఒక్కొక్కరికి 23,600/- రూపాయలు, కోర్స్ ఫీజు క్రింద 5000/- రూపాయల స్టై ఫండ్ తో కలిపి మొత్తము . 5,17,000/- రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నంలో 20 మంది యానాది లబ్దిదారులకు గిల్ట్ నగల తయారీ క్రింద స్కిల్ డెవలప్మెంట్ వారిచే శిక్షణ ఇవ్వటం జరిగిందని డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫణి ధూర్జటి వివరించారు.
తర్వాత 22 వ డివిజన్ కార్పొరేటర్ రాష్ట్ర యానాది సంఘం నాయకులు ఏకసిరి వెంకటేశ్వరరావు, మడిచర్ల సర్పంచ్ శాంతమ్మ, భూక్య దేవి, నక్కా వినయబాబు, మంగళగిరి శ్రీను, మద్దెల పాండురంగారావు, భూక్య శ్రీనివాస్ నాయక్ తదితరులు గిరిజన సంక్షేమంపై ప్రసంగించారు,
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జక్కుల ఆనందబాబు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.