అక్టోబర్ 27 (ఆంధ్రపత్రిక): ’రామసేతు’లో తన నటనను అందరూ అభినందిస్తున్నారని అక్షయ్ కుమార్ తాజా చిత్రం ’రామ్ సేతు’లో జడ్జిగా నటించిన నటి జయశ్రీ రాచకొండ తెలిపారు. సినిమా చూసిన వాళ్లు పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లు చెప్పారు. షూటింగ్లో భాగంగా వారం రోజులు చేసిన సీన్స్ అన్నీ కథకు అత్యంత కీలకమైనవన్నారు. అయితే ఎడిటింగ్‌లో అవన్నీ ఎగిరిపోతాయేమోననే అనుమానం ఉండేదని అన్నారు. ట్రైలర్లో తెగ మురిసిపోయినా… తన అదృష్టం విూద అనుమానం కలుగుతూనే ఉండేదని కానీ ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారని అన్నారు. ఈనెల 25న విడుదలైన రామ్ సేతు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితర స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలలానే ఉందని అంటున్నారు. ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ’లీగల్లీ వీర్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనసున ఉన్నది. చెప్పాలనున్నది, బ్రేకింగ్ న్యూస్, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న డాక్టర్ రెహానా’ తదితర చిత్రాలతో పాటు పలు యాడ్ ఫిల్మ్స్‌లో జయశ్రీ నటిస్తున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!