ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకం
…….. మాజీ మంత్రి ఆలపాటి.
ANDHRAPATRIKA : – గుంటూరు : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకమని
మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఓ ప్రయివేటు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ అభినందన సభలో మాజీ మంత్రి ఆలపాటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఫెడరేషన్ అక్రెడిటేషన్ జర్నలిస్టుల హెల్త్ కార్డులకు ఆర్థిక సహకారం అందించిన ప్రముఖ రియల్టర్ నలజాల లోకేష్ ను ఫెడరేషన్ తరపున ఆలపాటిచేతులమీదిగా
సత్కరించారు. కార్యక్రమం లో భాగం గా ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నూతనంగా
ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్, కార్యవర్గ సభ్యులు మునిపల్లి శ్రీకాంత్, వేముల రాజేష్, పట్నాల సాయి కుమార్, వరదల మహేష్, కొండవీటి పుల్లారావు, పుట్ల పున్నయ్య, చింతా మణి కుమార్, అంబటి శ్యామ్ సాగర్, అచ్యుత సాంబశివరావు, బుర్రా సుధీర్, చల్లా రవి లను దుశ్శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ జర్నలిస్టుల హెల్త్ కార్డులకు నిధులను సమకూర్చిన లోకేష్ లాంటి వ్యక్తులు అవసరమన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర సేవలు ఎంతో కీలకమన్నారు. చరిత్రలో వర్తమాన, భవిష్యత్ కాలమానాన్ని అక్షర రూపంలో ప్రజలకు అందించడానికి కృషి చేయాలన్నారు. వ్యక్తులకు ప్రాముఖ్యత కల్పించకుండా, సమాజంలో జరిగే వాస్తవ ఘటనలపై సమగ్రమైన వార్త విశ్లేషణలను అందించినప్పుడే విలేకరులకు గుర్తింపు లభిస్తుందన్నారు. తప్పుడు కథనాలు, అసత్య ప్రసారాలు ద్వారా ఊదరగొట్టడం పాత్రికేయరంగానికే చెడ్డపేరన్నారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ జహీర్, ఫెడరేషన్ సభ్యులు మేకల సుబ్బారావు, ఉన్నం భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు.