ఏప్రిల్ 10 నాటికి ఉత్తర్వుల్లో నిందితుడిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందని కళ్యాణ్ షౌకత్ ఎస్ గోర్వాడేలోని అదనపు సెషన్స్ జడ్డీ పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ కేసులో..నిందితుడు బద్లాపూర్ కర్జాత్ హైవేప్ కత్రాప్ వద్ద చైనీస్ తినుబండారాల షాపులో పనిచేసేవాడు. ఏప్రిల్ 14, 2017న బాధితుడు జగత్ తేగ్‌బహదు షాహీతో సహ ఆ తినుబండారాల యజమానులు, ఇతర సిబ్బంది సమక్షంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత యజమానులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ సదరు నిందితుడు, బాధితుడు మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్నారు. మరుసటి రోజు ఒక దుకాణదారుడు బాధితుడి తలతో ఉన్న రక్తపు ప్లాస్టిక్ బ్యాగ్ గురించి పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ నుచి సుమారు వెయ్యి అడుగుల దూరంలో బాధితుడి మొండాన్ని కనుగొన్నారు. దీంతో ఆ బాధితుడితో ఉన్న వ్యక్తి(రాజేష్ కుమార్)ని నిందితుడిగా అనుమానించి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తర ప్రదేశ్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. ఐతే పోలీసుల విచారణలో పలు లోపాలు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే బాధితుడు మరణానికి ముందు నిందితుడు అక్కడే ఉన్నాడు అనడానికి కావల్సిన ఆధారాలు కూడా సమర్పించడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుడని నొర్దోషిగా ప్రకటిస్తూ అతనికి ఈ కేసు నుంచి ఊరట కల్పించింది కోర్టు.