వృక్షాలను తొలగించాలి
చింతపల్లి, అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): ఒరిగిన,ఎండిన వృక్షాల వేరు భాగంలో మట్టి కోతకు గురైన వృక్షాల వలన ప్రమాదం పొంచి ఉంది చింతపల్లి మండలంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా అలాగే ప్రభుత్వ కార్యాలయాలు చెంత ఇటువంటి వృక్షాలు ప్రమాద బరితంగా దర్శనమిస్తున్నాయి. స్థానిక మండల పరిషత్ పరిధిలో అదేవిధంగా అటవీశాఖ కార్యాలయాల సమీపంలో ఏపుగా ఎదిగిన సిల్వర్ ఓక్ వృక్షాలు ఏ సమయంలోనైనా కూలడానికి సిద్ధంగా ప్రమాద బరితంగా ఉన్నాయి. ఇదే క్రమంలో స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయం ముందు, వెనుక భాగాలలో ఉన్న భారీ సిల్వర్ ఓక్ వృక్షాలలో ఇటీవల కురిసిన వర్షాలకు కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఒక వృక్షం కూలిపోగా ముందు భాగంలో ఉన్న వృక్షం విద్యాశాఖ కార్యాలయం పై ఒరిగిపోయి ప్రమాద భరితంగా ఉంది. ఆ సమీపంలో ఆధార్ కేంద్రంతో పాటు పిఆర్ జెఈ కార్యాలయం ఉంది. ఆధార్ కేంద్రానికి వచ్చే ప్రజలు కార్యాలయానికి ఈ వృక్షాల వలన ప్రమాదం పొంచి ఉందని బీతిల్లుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ఇటువంటి ప్రమాద భరిత వృక్షాలను గుర్తించి తొలగించాలని ఇదే క్రమంలో ప్రభుత్వ భవనాల చెంత ముఖ్య కోడళ్ళలో ప్రధాన రహదారులకు ఇరువైపులా కూడా ప్రమాద భరితంగా ఉన్న వృక్షాలను తొలగించాలని వాహన చోదకులు , ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.