నరసాపురం మొగల్తూరు నవంబర్ 27 (ఆంధ్ర పత్రిక)
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మేశ్వరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గా లక్ష్మేశ్వరం దేవాలయం నందు కార్తీక సోమవారం స్వామివారికి ఆలయ చైర్మన్ కంకటాల పెద్దిరాజు, చింతపల్లి త్యాగరాజు, ముదునూరి సాయిరాజు, కౌరు రామాంజనేయులు, ముస్తే మంగమణి, మురాళ్ల భవ్య శ్రీ రామ,ఈవో చాగంటి సురేష్ నాయుడుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పీతల వారి మెరక గ్రామ ప్రజల ఆర్థిక సహకారంతో ఆలయ ఆవరణలో కార్తీక వన సమారాధన భక్తులకు నిర్వహించారు.