ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అభయ్‌సింగ్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో అభయ్-వెలవన్ 11-4, 11-5తో ఒంగ్ సై హుంగ్-సిఫిక్ (మలేసియా)లపై నెగ్గారు.
‘మిక్స్డ్’ ఫైనల్లో అభయ్-జోష్నా చినప్ప (భారత్) 11-8, 10-11, 11-5తో టాంగ్ వింగ్-టాంగ్ హాంగ్ (హాంకాంగ్)లపై గెలిచారు.