న్యూఢల్లీి,సెప్టెంబర్28(ఆంధ్రపత్రిక): ఢల్లీి వక్ఫ్ బోర్డు కేసులో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అమానతుల్లా ఖాన్‌కు ఢల్లీి కోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది రాహుల్ మెహ్రా తన క్లయింట్ ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టుకు తెలియజేశారు. ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని, ప్రతి పైసాకు లెక్కలున్నాయని చెప్పారు. అవినీతి నిరోధక విభాగం ఈనెల 16న ఖాన్ నివాసంపై దాడులు జరిపింది. 24 లక్షల రూపాయల నగదు, రెండు లైసెన్సులు లేని తుపాకులు, కార్టిడ్జ్‌లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆయనను అరెస్టు చేసింది. ఢల్లీి వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఖాన్ ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘించి 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేసినట్టు ఏసీబీ తమ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులను చట్టవిరుద్ధంగా అద్దెలకు ఇచ్చారని, అవినీతి, ఆశ్రితపక్షపాతానికి ఆయన పాల్పడ్డారని ఆరోపించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఢల్లీి ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆప్ ఎమ్మెల్యే దుర్వినియోగం చేసినట్టు కూడా ఎఫ్ఐఆర్లో తెలిపింది. కాగా, అమానతుల్లా ఖాన్ సహచరుడు కౌషర్ ఇమామ్ సిద్ధిఖిని సెప్టెంబర్ 21న తెలంగాణలో అరెస్టు చేశారు. జామియా ప్రాంతంలో రెయిడ్స్ సందర్భంగా ఏసీబీ బృందంపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను కూడా ఢల్లీి పోలీసులు అరెస్టు చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!