Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్ (footpath)పై నిద్రిస్తున్న వారిపైకి ఓ ట్రక్కు (truck) దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రి పార్క్ (Shastri Park) సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఫుట్‌పాత్‌పై 5 మంది నిద్రిస్తున్నారు. ఓ ట్రక్కు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటన అనంతరం డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.