దుబాయ్, సెప్టెంబర్ 8 (ఆంధ్రపత్రిక): అఫ్ఘాన్‌తో జరుగుతన్న నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ జట్టుకు కెఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో జట్టుకు సారధ్యం వహిస్తున్న స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (26 నాటౌట్) టీమిండియాకు మంచి ఆరంభం ఇచ్చాడు. అప్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు విరాట్ కోహ్లీ (25 నాటౌట్)తో కలిసి నిలకడైన ఆరంభం అందించాడు. ముఖ్యంగా కోహ్లీ పవర్‌ప్లే చివరి ఓవర్లో అద్భుతంగా ఆడాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 52 పరుగులు చేసింది.
ఆసియా కప్‌లో భాగంగా భారత్, అఫ్ఘానిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘాన్ జట్టు మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఫ్ఘాన్ సారధి మహమ్మద్ నబీ కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసి తమను తాము ఛాలెంజ్ చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా సారధి కేఎల్ రాహుల్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, చాహల్‌లకు విశ్రాంతినిచ్చారు. వీరి స్ధానంలో దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఆడుతున్నారు.