దీంతో బ్రిటన్ అంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. అందులో ఉండే చేపలు వంటి ఇతర జలచర జీవులు ఏమయ్యాయో అని పర్వావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపించిన బ్రిటన్ ప్రభుత్వం నది అలా మారడానకి గల కారణం వివరించింది.
బట్టల రంగులు అనుకోకుండా నదిలో పడిపోవడంతో నీరు ఇలా ఆ విధమైన రంగులోకి మారిపోయిందని స్పష్టం చేసింది. దీనివల్ల నదిలో ఉండే చేపలు, ఇతర జలచర జీవులు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా పేర్కొంది. నది ఇలా మారిపోయినందుకు అధికారుల కూడా విచారం వ్యక్తం చేశారు. నిజానికి ఆ నది చుట్టు పక్కల ప్రాంతం పర్యాటక ప్రాంతంలా జనాల తాకికి ఎక్కువగా ఉండేది. ఈ అనూహ్య ఘటనతో అక్కడ ఉన్నవాళ్లంతా మాత్రం ఇక్కడ ఏదో జరిగింది.. నది అంతా కాలుష్యం అవుతుందంటూ మండిపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు విషయం బయట పడుతుందని, ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ దగ్గరుండి దీనిపై ఎక్వైయిరీ చేయాలని పట్టుబడుతున్నారు ప్రజలు.