chennai : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానం తిరిగి బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో సిబ్బంది కంగారు పడిపోయారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. దట్టమైన పొగ రావడంతో సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి చేరుకుంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానం. దాదాపు నాలుగు గంటలు తరువాత మంటలు పూర్తిగా ఆపి విమానాన్ని తనిఖీ చేసినా తరువాత 325 మంది ప్రయాణికుల తో ఎమిరేట్స్ విమానం మళ్లీ దుబాయ్ బయలుదేరింది. మంటలు రావడానికి ఇంజన్ వేడిగా ఉన్న సమయంలో ఇంధనం నింపడమే కారణం అని గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు అదేశించారు. ఏం జరుగుతుందో అర్థం కాక నాలుగు గంటల ఎయిర్ పొర్టు లాంచ్ లోనే ప్రయాణికులు ఉండిపోయారు.