మహేశ్ సినిమాకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఇంటి సెట్ ని ప్లాన్ చేశారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎస్.ఎస్.ఎం.బి 28 మూవీ కోసం అతడు ఇలాంటి సాహసం చేస్తున్నారు. ఇది పల్లెటూరిలో భారీ మండువా ఇల్లు. హైదరాబాద్ ఔటర్ లో మునుపెన్నడూ చూడనంత భారీగా దీనిని నిర్మిస్తున్నారని సమాచారం. దీనికోసం ఏకంగా 10 కోట్లు వెచ్చిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఈ సెట్ ప్రాముఖ్యత. మెజారిటీ పార్ట్ చిత్రీకరణ ఈ భారీ ఇంట్లోనే జరుగుతుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్` త్రివిక్రమ్` పూజా హెగ్డే కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలి షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల సారథి స్టూడియోలో పూర్తయింది. ఈ స్టూడియోలో గ్రావిూణ నేపథ్యంలోని పాతకాలపు డాబా ఇల్లు నిర్మించారు. రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 20న ప్రారంభం కానుంది. దీనికోసం నగర శివార్లలో భారీ సినిమా సెట్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఇంటి సెట్ నిర్మాణ బ్జడెట్ 10 కోట్లు ఖర్చవుతోందిట. మునుపెన్నడూ ఇంత భారీ పరిమాణంలో ఇంటి సెట్ ని ఎవరూ చూడలేదు. కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెట్ ని నిర్మిస్తున్నారని ఒకే`అంతస్తుతో నిర్మాణం ఆహ్లాదకరంగా కనిపిస్తుందని తెలిసింది. త్రివిక్రమ్ తో సినిమాని శరవేగంగా పూర్తి చేసి తదుపరి రాజమౌళితో మూవీ కోసం మహేష్ తన షెడ్యూల్ని సిద్దం చేస్తారు. దానికోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!