అక్టోబర్ 31 (ఆంధ్రపత్రిక): ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ’హిట్’ ఒకటి. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. నటుడిగా విశ్వక్‌సేన్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఇక ప్రొడ్యూసర్‌గా నానికి ఈ చిత్రంతో భారీ హిట్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ’హిట్`2’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించింది.ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను సోమవారం సాయంత్రం 4:59 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడిరచింది. కాగా ఈ అప్‌డేట్ టీజర్ గురించి అయ్యుంటుందని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. అడివి శేష్ ఇటీవలే మేజర్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ’హిట్`2’ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిర్‌నేని నిర్మిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!