ముంబై,అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరోసారి రికార్డు స్థాయిలో పతనమైంది. బుధవారంకరెన్సీ ట్రేడిరగ్ లో రూపాయి విలువ 71 పైసలు తగ్గి 83 రూపాయల రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. ఈ ప్రభావంతో అప్పటిదాకా లాభాల బాటలో నడిచిన భారత స్టాక్ మా ర్కెట్లు.. ఉదయం 11.20 గంటల తర్వాత నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.39 గంటల సమయానికి 59,377 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్.. ట్రే డిరగ్ సెషన్ ముగిసే సమయానికి దాదాపు 270 పాయింట్లు కోల్పోయి 59,107 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడిరగ్ సెషన్ లో ఒకానొక దశలో 17,601 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన నిప్టీ.. క్రమంగా తగ్గుతూ వచ్చి మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపు 105 పాయింట్లను కోల్పోయి 17,496కి పడిపోయింది. చివర్లో కొంత కోలుకొని 17,512 పాయింట్ల వద్ద ముగిసింది
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!