చెన్నై : తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఫ్లైఓవర్‌పై పనిచేస్తున్న బీహార్, జార్కండ్‌కు చెందిన ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని రక్షించారు.
చికిత్స నిమిత్తం అంబూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఫ్లైఓవర్ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందకున్న అంబూర్ పోలీసులు ఘటనపై వివరాలు తెలసుకున్నారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసి.. కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.