నిరుద్యోగ యువకులే అతని టార్గెట్…. ఉద్యోగం ఆశ చూపి, యువకులను మోసం చేస్తున్న నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు చర్లపల్లి పోలీసులు.. టాక్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తాను.. అంటూ నిరుద్యోగ యువకుల నుండి లక్షల రూపాయల మోసాలకు పాల్పడుతున్నాడు.. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు..
నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నటువంటి నకిలీ అటవీ శాఖ ఆఫీసర్‌ను చర్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ యూసఫ్ గూడా కు చెందిన కొనకంచి కిరణ్ కుమార్ అనే వ్యక్తి అ గతంలో ఖమ్మం అటవీ శాఖలో అవుట్సోర్సింగ్ లో పనిచేసేవాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కిరణ్.. అనంతరం ఆ ఉద్యోగాన్ని మానేసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ ఆఫీసర్ అవతారం ఎత్తాడు. నిరుద్యోగులను టార్గెట్ చేసి వారిని మోసం చేశాడు అతని వద్ద నుంచి అటవీశాఖ నకిలీ గుర్తింపు కార్డు యూనిఫామ్ బొమ్మ పిస్తోల్ తో సహా బైక్ సెల్ ఫోన్ కంప్యూటర్స్ ను స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టాక్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ చర్లపల్లి కి చెందిన బాధితుడు బోయిని సంతోషం కిరణ్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాత ముఖం చాటేయడంతో తాను.. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులపే ఆశ్రయించాడు. అనంతరం ఒక్కొక్కరిగా బాధితులు పోలీస్ స్టేషన్ కి క్యూ కట్టడంతో అసలు బండారం బయటకు వచ్చింది. సంతోష్ నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసినట్లుగా తెలిసింది. నిందితుడు కిరణ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించినట్లుగా వెల్లడించారు.
బొమ్మ తుపాకీతో కట్టెల లోడుతో వెళ్తున్నటువంటి వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడుతూ 26 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విధంగా నకిలీ అటవీశాఖ అధికారిగా అవతారం ఎత్తి పెద్ద మొత్తంలో డప్పులను వసూలు చేశాడు.