డిసెంబర్ 08 (ఆంధ్రపత్రిక): సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎన్ని వచ్చినా.. మళ్లీ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో చిత్రాలు తెరకెక్కిస్తుంటారు డైరెక్టర్లు. వాటిని ప్రేక్షకులు ఆరాధిస్తూనే ఉంటారు. అయితే, దృశ్యం సినిమాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ జీతూ జోసెఫ్, అదే జానర్ లో మరొక మలయాలం సస్పెన్స్ థ్రిల్లర్ ’కూమన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవంబర్ 4న వచ్చిన ఈ సినిమా, థియేటర్లే కాకుండా ఓటీటీలోనూ (అమెజాన్ ప్రైమ్) హిట్ టాక్‌తో నడుస్తుంది. దృశ్యం`1,2 సినిమాలు తీశాక జీతూ జోసెఫ్ స్టామినా ఎంటో అందరికీ అర్థమై ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌తో పాటు కథలో ట్విస్ట్‌లను చూపించే విధానం బాగుంటుంది. ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో అయినా కథని ఎంతో కొంత ముందే ఊహించొచ్చు. విలన్ ఎవరో కనిపెట్టేయొచ్చు. కానీ, జీతూ జోసెఫ్ సినిమాల్లో ఊహించని మలుపులతో కథని ముందుకు తీసుకెళ్లాడు. స్టోరీ, విలన్ గురించి ముందు తెలిసినట్టే అనిపించినా.. చివరికి ట్విస్ట్‌లతో కథ మారిపోవడం అతని సినిమాలో జరుగుతుంటుంది. అలాంటి ట్విస్ట్ లు, షాక్ లు ఇచ్చే సినిమానే ఈ కూమన్. తమిళనాడు `కేరళ బార్డలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంటాడు గిరి (ఆసిఫ్ అలీ). కష్టపడి పనిచేస్తూ, చిన్న చిన్న కేసుల్ని సులువుగా సాల్వ్ చేస్తుంటాడు. తనని ఎవరైనా చిన్న మాటన్నా, తనకు వ్యతిరేకంగా ఏం చేసినా వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే మెంటాల్టీ కలిగి ఉంటాడు. ఒక రోజు వాళ్ల స్టేషన్ కి కొత్తగా వచ్చిన సీఐ, ఒకసారి గిరిని బురదలోకి తోసేస్తాడు. దాంతో అతనిపై ఎలాగైనా రివేంజ్ తీసుకోవాలని పగతో రగిలిపోతుంటాడు గిరి. అలా పగలు పోలీస్‌గా, రాత్రుళ్లు దొంగగా ఉంటూ ఊళ్లో దొంగతనాలు చేస్తుంటాడు. పోలీస్ ఎంత ప్రయత్నించినా దొంగ ఎవరన్నది కనిపెట్టలేకపోతుంటారు. దాంతో సీఐకి అధికారులనుంచి ఒత్తిడి పెరుగుతుంది. దొంగతనాలవల్ల వచ్చిన డబ్బుకి బాగా అలవాటుపడిపోయినా గిరి, వరుసగా దొంగతనాలు చేస్తుంటాడు. ఒక రోజు ఊళ్లోని ఒక పెద్దింట్లో దొంగతనానికి వెళ్తాడు. ఆ రోజు ఆ ఇంటి యజమానికి దొరికినట్టే దొరికి తప్పించుకుంటాడు. సీన్ కట్ చేస్తే.. తర్వాతి రోజు ఆ యజమాని చనిపోయి చెట్టుకు వేలాడుతూ కనిపిస్తాడు. దీంతో గిరికి ఏం అర్థం కాదు. అప్పటినుంచి ఆ ఊళ్లో అలాంటి దొంగతనాలు, మరణాలే జరుగుతుంటాయి. ఈ విషయాలపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులకు దొంగ ఎవరో తెలిసిందా? కిల్లర్‌ని పట్టుకుంటారా? ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారు? చివరికి ఏం జరుగుతుంది? అనేది కథ. గిరి ఒక దొంగ దగ్గర దొంగతనం టెక్నిక్స్ తెలుసుకొని, వాటినే అమలు పరుస్తుంటాడు. సినిమా ఇంటర్వెల్ టైంలో ఆల్మోస్ట్ దొంగను పట్టుకుంటారు అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ తర్వాత మర్డర్ మిస్టరీతో కథ వేరే మలుపు తిరుగుతుంది. అయితే, కిల్లర్ ఎవరనేది చివరివరకు సీక్రెట్‌గా ఉండేలా, ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ప్లాన్ చేసి సినిమా తీశాడు జోసెఫ్. మలయాలం యాక్టర్ ఆసిఫ్ ఈ సినిమాలో హీరోగా చేశాడు. స్టోరీ మొత్తాన్ని తన చుట్టూ తిప్పించుకున్న ఆసిఫ్ అతని పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, క్లోజప్ షార్ట్స్, చూస్తుంటే సీట్లలో కూర్చున్న అభిమానులకి టెన్షన్ వస్తుంది
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!