ఒక డెడ్ బాడీ వంద అనుమాలు.. కాలిపోయిన స్థితిలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. బర్త్డే పార్టీ సెలెబ్రేషన్ లో పాల్గొన్న తెల్లారే అనంత లోకాలకు.. పెట్రోల్ బంక్ సీసీ టీవీలో ఒంటరిగా బైక్ పై బోటిల్ లో పెట్రోల్ తీసుకుని వెళ్తున్నట్లు రికార్డ్ అయినా దృశ్యాలు.. ఐ థింక్ థిస్ ఇజ్ మై లాస్ట్ డే అంటూ చివరి స్టేటస్.. స్టేటస్ పెట్టిన తెల్లవారే విజయవాడ నగరు శివార్లో కాలిన స్థితిలో దొరికిన జీవన్ డెడ్ బాడీ..
ఒక డెడ్ బాడీ వంద అనుమాలు.. కాలిపోయిన స్థితిలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. బర్త్డే పార్టీ సెలెబ్రేషన్ లో పాల్గొన్న తెల్లారే అనంత లోకాలకు.. పెట్రోల్ బంక్ సీసీ టీవీలో ఒంటరిగా బైక్ పై బోటిల్ లో పెట్రోల్ తీసుకుని వెళ్తున్నట్లు రికార్డ్ అయినా దృశ్యాలు.. ఐ థింక్ థిస్ ఇజ్ మై లాస్ట్ డే అంటూ చివరి స్టేటస్.. స్టేటస్ పెట్టిన తెల్లవారే విజయవాడ నగరు శివార్లో కాలిన స్థితిలో దొరికిన జీవన్ డెడ్ బాడీ.. తండ్రి కట్టామని ఇచ్చిన EMI డబ్బులు వాడుకోవటమే ఆత్మహత్యకు కారణం అంటున్న పోలీసులు..? నిజంగానే ఆత్మహత్య లేక వేరే కోణం ఏదైనా ఉందా లెట్స్ వాచ్ థ స్టోరీ.. తోట్లవల్లూరు కు చెందిన జీవన్ ఫ్యామిలీ కొద్దికాలంగా విజయవాడలో వుంటున్నారు తండ్రి సుధాకర్ వాచ్ మెన్ కాగా…తల్లి హౌస్ వైఫ్ .. ఇక జీవన్ వన్ టౌన్ పొట్టి శ్రీరాములు కాలేజ్ లో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుండి పార్టీ ఉందంటూ వెళ్లినా జీవన్ తెల్లవారే కాలి శవమై కనిపించడు…ఆ రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి ఇక నేను మీకు భారం కాను,నాన్న జాగ్రత్త ,నావల్ల మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.. అనుమానం వచ్చిన తల్లి ఏమైందిరా ఏమన్నా అప్పులు ఉన్నాయా అని అడిగింది.. ఎం లేదంటూ ఫోన్ పెట్టేసిన జీవన్ ఇక ఫోన్ ఎత్తలేదు …ఈలోపే తెల్లవారింది పోలీసుల నుండి జీవన్ చనిపోయాడంటూ వార్త రానే వచ్చింది దాంతో తల్లి తండ్రులు ఆస్పత్రి వద్ద గుండెలు పగిలేలా రోధించారు…స్నేహితులే ఎదో చేసారంటూ తండ్రి ఆరోపించాడు.
ఈ కేస్ లో మొదటి నుండి పోలీసులు సైతం మర్డర్ గానే భావించారు అదే విధంగా మొదట మర్డర్ కేస్ గా నమోదు చేసారు.. కానీ అంతలోపు మరో కోణం వెలుగులోకి వచ్చింది…తండ్రి కట్టమని ఇచ్చిన 12 వేల EMI డబ్బులు కట్టకుండా తానా సొంతానికి వాడుకున్నట్లు దాని వాళ్ళ తండ్రి గట్టిగా మందలించాడని తల్లి పోలీసుల విచారణలో చెప్పింది.. తండ్రి మందలింపుతో మనస్తాపానికి గురైన జీవన్ ఇంట్లోచి వెళ్ళిపోయి రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి మళ్ళి పార్టీ ఉందంటూ బయటకు వెళ్ళాడు.. ఆలా వెళ్లినా జీవన్ మళ్ళి ఇంటికి రాలేదు.. ఇంట్లోంచి వెళ్లిపోయిన రెండు రోజులు జీవన్ స్నేహితులతోనే ఉన్నాడు.. బర్త్డే పార్టీ తర్వాత కూడా స్నేహితుల తోనే ఉన్న జీవన్ హ్యాపీ బర్త్డే శ్యామ్ అంటూ వీడియో చేసి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కూడా పెట్టాడు …పార్టీ లో కూడా బాగానే ఉన్నాడు.. పార్టీ అయిపోయాక సడన్ గా ఏదో ఫోన్ వస్తే స్నేహితుడి బండి తీసుకుని బయటకు వెళ్ళినట్లుగా చెప్తున్నారు స్నేహితులు.. జీవన్ కు ఎలాంటి అప్పులు లేవని ఇంట్లో emi డబ్బులు వాడుకోవటంతో వాళ్ళ నాన్న తిట్టాడని చెప్తున్నారు.. బండి అడిగి వెళ్ళినా కొద్దీ సేపటికే ఐ థిక్ థిస్ ఇజ్ మై లాస్ట్ డే అంటూ స్టేటస్ పెట్టడంతో అది చుసిన మరో స్నేహితుడు సరదాగా అనుకుని తొక్కలే అని రిప్లై పెట్టాడు దాంతో ఈ రాత్రికి నీకే తెలుస్తుందిలే అని మెస్సేజ్ పెట్టాడు జీవన్..
మరో పక్క జీవన్ బైక్ పై ఒంటరిగా వెళ్తూ బోటిల్ లో 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.. బోటిల్ లో పెట్రోల్ కొట్టాం అన్న సారె బైక్ మధ్యలో ఆగిపోయిందని చెప్పి మరి బోటిల్ లో పెట్రోల్ కొట్టించుకుని తీసుకుని వెళ్ళాడు జీవన్.. ఇక పెద్దపులిపాక వరకు ఎదో పని మీద ఒంటరిగా వేగంగా వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. వీటితో పాటు ఘటన స్థలం వద్ద జీవన్ బైక్,సెల్ ఫోన్ దొరికాయి.. చనిపోయిన తీరు ,తల్లికి చేసిన ఫోన్ ,పెట్టిన స్టేటస్ తప్పా వేరే ఆధారాలేవీ పోలీసులకు లభ్యం కాలేదు.. ఆత్మహత్య అని బలపడేలా అన్ని ఆధారాలు దొరకడంతో అందరిని విచారించి ఆత్మహత్య గానే నిర్ధారించారు పోలీసులు.. వ్యసనాలకు బానిసై అప్పులు చేసి EMI డబ్బులు వాడుకోవటం తండ్రి తిట్టడంతో మనస్థాపానికి గురై తనకు తానుగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లుగా తేల్చారు.