చింతూరు డిసెంబర్ 03(ఆంధ్రపత్రిక):
చింతూరు మండలం ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఉన్నం శ్రీకాంత్ (38), మద్ది.ప్రియాంక (30) సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త పండు చూడడంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త పండు ఇనుప రాడ్డుతో ఇద్దరిని బలంగా కొట్టడంతో. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో వున్న
ప్రియాంకను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం పండు శ్రీకాంత్ కు చెందిన కారును ధ్వంసం చేశాడు. మృతి చెందిన ప్రియాంకకు ఇద్దరు కుమార్తెలు కలరు. వారిలో రాహిత్య (6) ఇంకొక కుమార్తె తన్విత (4) తల్లి మరణం తెలియని పసిపిల్లలు ఆడుకోవడం చూసేవారికి హృదయ విదారకంగా హృదయాన్ని కలచివేస్తుంది.
ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు పేర్కొన్నారు.