ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలో విద్యుత్ షాక్ కు గురై చిన్నారి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం…. నిజాంబాద్ కు చెందిన సౌందర్య ,మనిశ్ దంపతులకు సింధూర, మధుర అనే కుమార్తెలు ఉన్నారు.
కాగా దంపతులు ఉరెళ్తుండటంతో వారి కుమార్తెలు మధుర , సింధూరలను గురువారం ఆలూరు లోని అమ్మమ్మ లావణ్య ఇంట్లో వదిలి వెళ్లారు.
కాగా శుక్రవారం సాయంత్రం ఆడుకుంటున్న సింధూజ కూలర్ ను తాకింది. దీంతో విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారికి తీవ్రగాయాలైనాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆర్మూర్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో కుటుంబంలో విషాదఛాయలనుకున్నాయి. ఆర్మూర్ లో కూలర్ షాక్కు గురై 15 రోజుల క్రితం ఓ చిన్నారి మృతి చెందగా ఇది రెండో ఘటన.