
అలరించిన విద్యార్థుల పిరమిడ్ విన్యాసాలు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు.
వేపాడ,మార్చి,29( ఆంధ్ర పత్రిక ):- మండలంలోని సోంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి బాల భాస్కరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు విందు కార్యక్రమం ఆకర్షణీయంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ విన్యాసాలు ఉపాధ్యాయులను అలరించాయి.అలాగే 3వ తరగతి నుండి పది తరగతి విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ గత పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సీఆర్పీ ప్రసాద్, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.