తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం పాలకుర్తి మండలం, విస్నూర్ నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, స్థానిక నేతలు పాల్గొన్నారు. విస్నూర్, లక్ష్మీనారాయణపురం, పాలకుర్తి, కడవెండి వరకూ పాదయాత్ర సాగనుంది. మంగళవారంతో బండి సంజయ్ వెయ్యి కిలోవిూటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. దేవరుప్పుల దాడి ఘటనల నేపథ్యంలో పాదయాత్ర రూట్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొంద పెట్టేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. పాలకుర్తి చౌరస్తాలో రోడ్ షో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో నిజాం పాలన సాగుతోందని ఆరోపించారు. తాను వస్తున్నాననే పోలీసులు షాపులు బంద్ చేయించారని విమర్శించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. తమ లిస్ట్ లో వరంగల్ సీపీ పేరు రాసుకున్నామని అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ సర్కారు చేయని పక్షంలో మెడలు వంచి జరిపిస్తామని చెప్పారు. కేటీఆర్ డీజే టిల్లు అని, ముఖ్యమంత్రిని పాస్ పోర్టు బ్రోకర్ అని విమర్శించిన ఆయన ఖమ్మం హాస్పిటల్లో కేసీఆర్ మందు తాగుతూ దొంగదీక్ష చేశారని అన్నారు. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని బండి హావిూ ఇచ్చారు. హుజూరాబాద్‌లో ఓటుకు పదివేలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో రూ.30 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చే పైసలు తీసుకొని బీజేపీకి ఓటేసి గడీల పాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రపై టీఆర్ఎస్ నేతల దాడిని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఢల్లీిలో ఖండిరచారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందన్నారు. టీఆర్ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. పోలీసుల తీరు కూడా సరిగ్గా లేదని అన్నారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారని… పోలీసులు న్యాయం వైపు ఉండాలని హితవుపలికారు. బీజేపీలో చేరికలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. అమిత్ షా మునుగోడు సభపై బుధవారం స్పష్టత ఇవ్వనున్నట్లు తరుణ్ చుగ్ వెల్లడిరచారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!