పద్నాలుగేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డకి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్దా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ’డీజే టిల్లు’ సినిమా ధైర్యాన్నిచ్చింది. సిద్ధూజొన్నల గడ్డకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. గతేడాది మార్చి 12 చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది. సిద్ధూ జొన్నలగడ్డ నటన, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ యూత్నే కాదు ఫ్యామిలీ ఆడియోన్స్‌ను మెప్పించాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధూకు సుకుమార్ స్కూల్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. టిల్లూ స్క్వేర్ తర్వాత సుకుమార్ ప్రొడక్షన్ హౌజ్‌లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సుకుమార్ శిశ్యుడే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక టిల్లూ స్క్వేర్ విషయానికొస్తే సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందిస్తున్నాడు. ఈ సీక్వెల్ చిత్రాన్ని కొత్త దర్శకుడు మల్లిక్‌రామ్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఆయన తేజ సజ్జాతో ’అద్భుతం’ సినిమా తీశాడు. కాగా మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ.. హీరోతో బేధాబిప్రాయాలు రావడంతో సినిమా నుండి తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!