చిన్న పిల్లలు అమ్మనాన్నలపై అలిగినప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ, అమ్మమ్మ లేదా తాతయ్యల దగ్గరికి వెళ్తడం మాములే. కాని చైనాలో ఓ బాలుడు తన తల్లితో గొడవపడి ఆమెపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడనానికి ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాడు.వివరాల్లోకి వెళ్తే మీజింగ్లో ఉంటున్న 11 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే తాజాగా ఏదో విషయంలో వాళ్లిద్దరికి గొడవ జరగింది. ఆ తల్లి తన కొడుకుని తిట్టింది. కోపంతో ఆ బాలుడు ఈ విషయం అంతా అమ్మమ్మకు చెప్తానని తల్లితో అన్నాడు. ఆమె కూడా పట్టించుకోలేదు. దీంతో ఆ బాలుడు జరిగిన విషయాన్నంతా అమ్మమ్మకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే వాళ్ల అమ్మమ్మ ఇంటికీ చేరుకోవాలంటే దాదాపు గంట సమయం పడుతుంది.
ఈ సంఘటన సాయంత్రం పూట జరగడంతో ఆ సమయంలోనే ఆ బాలుడు సైకిల్‌పై అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపై కనిపించే బోర్టులు చూసుకుంటూ ముందుకు సాగాడు. కాస్త దూరం వెళ్లాక తన వెళ్లాల్సిన దారిని మరిచిపోయాడు. అలా తొక్కుతూ తొక్కతూ దాదాపు 130 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ టన్నెల్ వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. బాలుడ్ని విచారించగా జరిగిన విషయాన్ని తెలుసుకొని పోలీసులు షాకయ్యారు. ఆ తర్వాత పోలీస్ జీపులో అతడ్ని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లారు.అనంతరం ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వాళ్లు వచ్చి తీసుకెళ్లారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటన నెటీజన్లను ఆశ్చర్యపరుస్తోంది.