- వాట్సాప్కు గ్రహణం..వీడిరది!
- రెండున్నర గంటలపై హైరానా
- మధ్యాహ్నం 12.07 గంటల నుంచి తలెత్తిన సమస్య
- పర్సనల్ మెసేజ్లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుంది
- స్టేటస్లు కూడా అప్ డేట్ కాలేదు
న్యూఢల్లీి,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడిరది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. పర్సనల్ మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుండగా.. స్టేటస్లు కూడా అప్ డేట్ కావడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలి యక యూజర్లు ఆయోమయానికి గురవుతున్నారు.వాట్సప్ యూజర్లు తొలుత ఇంటర్నెట్ ప్రాబ్లం కారణంగా మెసేజ్ పంపలేకపోతున్నామని భావించారు. కానీ అరగంట గడిచినా ప్రాబ్లం కంటిన్యూ కావడంతో విషయం అర్థమైంది. భారత్తో పాటు ఇటలీ, టర్కీలోనూ వాట్సప్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వాట్సప్ అంతరాయానికి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు. వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. అయితే దాదాపు రెండు గంటల అనంతరం వాట్సప్ పనిచేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12. 30 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సప్ సేవలు.. తిరిగి 2.15 గంటల నుంచి పునుం ద్ధరించబడ్డాయి. అందరికి మెసేజ్ లు వెళుతున్నట్లు యూజర్లు సోషల్ విూడియాలో కామెంట్లు చేస్తున్నారు. యూజర్లు మెసేజ్ లు పంపలేకపోతున్నట్లు తమ దృష్టికి రావడంతో సమస్యను పరిష్కరించినట్లు మెటా కంపెనీ ప్రతినిధి చెప్పారు.సర్వర్ డౌన్ అవడమే కారణమని… టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ వాట్సప్ ను త్వరగా రీస్టోర్ చేశారని వెల్లడిరచారు. దేశ వ్యాప్తంగా 50 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వాట్సప్ డౌన్లోడ్స్ జరిగాయి. వాట్సప్ లో రోజుకు 10వేల కోట్ల మెసేజ్లు సెండ్ అవుతున్నాయి. 80 దేశాల్లో వాట్సప్ కు యూజర్లు ఉన్నారు. వాట్సప్ ద్వారా నిమిషానికి 2 కోట్ల 9 లక్షల మెసేజ్ లు సెండ్ అవు తున్నాయి. వాట్సప్ లో ప్రతి రోజూ 5 కోట్ల 5 లక్షలకు పైగా వీడియో కాల్స్ జరుగుతున్నాయి. యూజర్లు ప్రతి రోజూ సగటున 23 సార్లు వాట్సప్ ఓపెన్ చేస్తున్నారు . అలాగే ప్రతి రోజూ వాట్సప్ కు సగటున 10 లక్షలకు పైగా కొత్త యూజర్లు వస్తున్నారు.