యు.కొత్తపల్లి,అక్టోబర్ 23 (ఆంధ్రపత్రిక):ఉప్పాడ కొత్తపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో గత 25 రోజులుగా 9,10 తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాటశాల ప్రారంభం అయిన కొంతసేపటికి కళ్ళు తిరిగి పడిపోతున్నారు.వారికి తోటి విద్యార్థులు సపర్యలు చేస్తే కాస్సేపటికి తెరుకుంటున్నరు.ఇలా 25 రోజులుగా ప్రతిరోజూ స్కూల్ లో ఇదే విధంగా జరుగుతుంది.గత శనివారం కొంత మంది విద్యార్థినులు పాటశాల ప్రారంభం అయిన తర్వాత యదావిధిగా మళ్ళీ కళ్ళు తిరిగి,శ్వాస సరిగ్గా అందక కొట్టుకున్నారు.దీంతో పాటశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇలా జరుగుతున్న విషయాన్ని మండల విద్యాశాఖ అధికారికి తెలిపినట్లు ఇచ్చినట్లు సమాచారం.దీనితో అప్రమత్తం అయిన విద్యాశాఖ అధికారులు. ఆదివారం ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో మళ్ళీ యదావిధిగా 7గురు కళ్ళు తిరిగి పడిపోయారు.దీనితో వారిని హుటాహుటిన కొత్తపల్లి పి హెచ్ సి కి తరలించి వారికి అక్సిజెన్ అందించారు.అయిన వారు సరిగ్గా కోలుకోలేక పోవడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా 25 రోజుల నుండి పిల్లలకు ఇలా జరుగుతున్న నేపథ్యంలో కనీసం తల్లిదండ్రులకు కానీ,సంభదిత వైద్య,విద్యా శాఖ అధికారులకు పాటశాల ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వక పోవడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మా పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే దొరబాబు పరామర్శ
ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, విషయం తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హుటాహుటిన కొత్తపల్లి ఆసుపత్రికి చేరుకున్నారు.విద్యార్థులకు అందుతున్న వైద్యంపై అరా తీశారు.అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ,ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోవడం తన దృష్టికి వచ్చిందని,దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటామని, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భోరోసా ఇచ్చారు.తీవ్ర అస్వస్థతకు గురి విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు,వారికి అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే చెప్పారు.ఈ సంఘటన ఎప్పటికప్పుడు ఇలా దొరుకుతుందో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలి:మాజీ ఎమ్మెల్యే వర్మ
25 రోజులుగా ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల తీవ్ర అస్వస్థతకు గురవుతున్న విషయం తెలిసినప్పటికీ పూర్తిగా నిర్లక?్యం వహించిన పాటశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని,అలాగే తీవ్ర అస్వస్థతకు గురి అయిన పిల్లలకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే,టీడీపీ అధికార ప్రతినిధి వర్మ డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురవుతున్న విషయం తెలుసుకొని వర్మ హుటాహుటిన కొత్తపల్లి పి హెచ్ సి వద్దకు చేరుకున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పరామర్శించారు.ఉపాధ్యాయులు చదువుతున్న విద్యార్థుల పట్ల శ్రద్ద ఎంత ఉన్నదో తెలుస్తోందని,కనీసం పిల్లల తల్లిదండ్రులకు అయినా సమాచారం ఇవ్వకపోవడం పట్ల తీవ్రంగా వర్మ మండి పడ్డారు. అలాగే స్కూల్ లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి,ప్రతిఒక్క విద్యార్థికి వైద్య పరీక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉప్పాడ హైస్కూల్లో జిల్లా అధికారులు ఆరా
విద్యార్థుల అస్వస్థతకు గురైన సంఘటనపై జిల్లా అధికార యంత్రాంగం కదిలింది.జెడ్పీ సీఈవో ఎన్ వీవీ సత్యనారాయణ, డీఈవో డి.సుభద్ర,డీఎల్ డీఈవో పి.నారాయణ మూర్తి ఉప్పాడ హైస్కూల్లో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.తొలుత హైస్కూలు పరిశీలించి,అనంతరం విద్యార్థులకు జరిగిన సంఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర వైసిపి నాయకులు రావు చిన్నారావు, కొత్తపల్లి వైద్యాధికారిణి కుసుమ మౌనిక తదితరులు సమావేశాలలో ఉన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!