హరిద్వార్,అక్టోబర్ 23(ఆంధ్రపత్రిక) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లోని మానాలో ఓ తాత్కాలిక గుడిసెలో శనివారం రాత్రి బస చేశారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కూలీ తయారు చేసిన కిచిడీ, మాండ్వే కీ రోటీ, లోకల్ చట్నీ, రaాగోరే కీ ఖీర్లను కూలీలతో కలిసి తిన్నారు. సముద్ర మట్టం నుంచి 11,300 అడుగుల ఎత్తులో టిన్ పై కప్పుతో కూడిన ఈ తాత్కాలిక గుడిసె సముద్రమట్టం నుంచి 11,300 అడుగుల ఎత్తులో ఉంది. ఇది బీఆర్ఓ డిటాచ్మెంట్ సెంటర్. 11,300 అడుగుల ఎత్తులో గుడిసెలో బస చేసిన మోదీ… కూలీ వండిన కిచిడీ తిని గగడిపారు. బీఆర్ఓ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మానాలోని తమ డిటాచ్మెంట్ సెంటర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నట్లు, రాత్రి బస చేయబోతున్నట్లు తెలుసుకుని తాము నిర్ఘాంతపోయామని చెప్పారు. ఈ కేంద్రం ఓ యువ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడుస్తోందని చెప్పారు. ఇక్కడ నామమాత్రపు సదుపాయాలు ఉంటాయని చెప్పారు. సౌకర్యాలేవీ దాదాపు ఉండవని తెలిపారు. ప్రధాన మంత్రి వస్తుండటంతో 72 గంటల కన్నా తక్కువ సమయంలో ఈ తాత్కాలిక గుడిసెను నౌక మాదిరిగా మార్చినట్లు తెలిపారు. ఈ డిటాచ్మెంట్లో మోదీ రోడ్డు నిర్మాణ కూలీలతో మాట్లాడారని తెలిపారు. రాత్రి భోజనం కోసం కిచిడీ తయారు చేయాలని ఓ కూలీని మోదీ కోరారని చెప్పారు. మోదీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి పదార్థాలను తీసుకురాలేదన్నారు. ఈ కేంద్రంలో ఉన్న రేషన్ సరుకులనే ఉపయోగించి వంటకాలను తయారు చేసినట్లు చెప్పారు. అధికారులు బదరీనాథ్‌లో ఏర్పాట్లు చేసినప్పటికీ, ఈ డిటాచ్మెంట్లోనే తాను రాత్రి బస చేస్తానని మోదీ చెప్పార న్నారు. ఆయనతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని తెలిపారు. వీరంతా డిటాచ్మెంట్ రోడ్డు నిర్మాణ కూలీ తయారు చేసిన ఆహారాన్ని భుజించారని చెప్పారు. ప్రధాన మంత్రి ఏం తింటారని ఆయన సిబ్బందిని ఈ డిటాచ్మెంట్ కమాండర్ ఏఈఈ భావనా జోషీ అడిగారని, సులువుగా తయారయ్యే స్థానిక వంటకం ఏదైనా పరవాలేదని మోదీ చెప్పారని తెలిపారు. దీంతో తాత్కాలిక కుక్ రంగంలోకి దిగి కిచిడీ, పోహా, విూఠా కరేలీ, రaాగోరే కీ ఖీర్ తయారు చేశారని చెప్పారు. సముద్ర మట్టం నుంచి 11,300 అడుగుల ఎత్తులో సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితిలో రాత్రి వేళ మోదీ బస చేశారన్నారు. గదిని వేడిగా ఉంచే ఓ చిన్న ఎలక్టిక్ర్ హీటర్‌ను పెట్టుకుని, ఓ చిన్న గదిలో బస చేశారన్నారు. కూలీలతో కలిసి బస చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని మోదీ చెప్పారన్నారు. ’భారత్ మాతా కీ జై’ అంటూ జయజయధ్వానాలు చేసే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారని చెప్పారు. వంట చేసి, సేవలు చేసి మోదీ ప్రశంసలు పొందిన దేవేంద్ర రాజేశ్, అనితేష్ కుమార్, సురేష్ సైనీలను డైరెక్టర్ జనరల్స్ కమెండేషన్ కార్డ్‌లతో లెప్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి సత్కరించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఎంతో శ్రమించి పని చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. కఠోర శ్రమతో అన్నిటినీ సాధించవచ్చునని సందర్శకుల పుస్తకంలో రాశారు. మోదీ శనివారం కేదార్నాథ్, బదరీనాథ్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రెండు వ్యూహాత్మక రోడ్ల విస్తరణకు శంకుస్థాపనలు చేశారు. మానా కనుమ ఉత్తరాఖండ్`చైనా మధ్య అత్యంత ప్రాచీన వాణిజ్య మార్గం. చౌకాంబ శిఖరంపైకి ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. ఔత్సాహిక మోటార్‌సైకిల్ రైడర్స్‌కు ఇది చాలా ఆకర్షణీయమైన ప్రదేశం
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!