శ్రీహరికోట,అక్టోబర్ 23 (ఆంధ్రపత్రిక): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను సొంతం చేసు కున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్`3 రాకెట్‌ను విజయ వంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు జీఎస్ఎల్వీ`మార్క్ 3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ బాహుబలి రాకెట్ విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ అయిన వన్‌వెబ్‌కి చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా నిగిలోకి పంపించారు. యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.కాగా, ప్రయోగం విజయంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. యూకేకు చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చు కున్నామని.. అందులో భాగంగానే ఇప్పుడు 36 ఉపగ్రహాలను పంపించామని తెలిపారు. ఈ ప్రయోగం తర్వాత వరుసగా రాకెట్ ప్రయోగాలు చేపడతామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్లను ప్రయోగిస్తామని చెప్పారు.దీపావళి పండుగ తమకు ఓ రోజు ముందుగానే ప్రారంభమైందని డాక్టర్ ఎస్ సోమనాథ్ అన్నారు. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి భారీ రాకెట్ ఎం3`ఎం2ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించి 36 బ్రాడ్‌బాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్ష్యలలోకి ప్రవేశపెట్టడంతో దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. బ్రిటన్‌కు చెందిన కస్టమర్ వన్‌వెబ్ లిమిటెడ్‌కి చెందిన 36 బ్రాడ్‌బాండ్ శాటిలైట్స్‌ను ఈ భారీ రాకెట్ ఎం3`ఎం2 ద్వారా విజయవంతంగా కక్ష్యలలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఇస్రో ప్రథమ వాణిజ్య కార్యకలాపాన్ని విజయవంతం చేసి చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 దాదాపు సిద్ధమైందని చెప్పారు. ఇంటిగ్రేషన్, టెస్టింగ్ దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. అయితే మరికొన్ని పరీక్షలు చేయవలసి ఉందన్నారు. కొద్ది కాలం తర్వాత ఈ పరీక్షలను నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. రెండు స్లాట్లు ఉన్నాయని, ఒకటి 2023 ఫిబ్రవరిలోనూ, మరొకటి 2023 జూన్‌లోనూ ఉన్నట్లు తెలిపారు. చంద్రయాన్ ప్రయోగానికి 2023 జూన్ స్లాట్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. సతీశ్ ధావన్ సెంటర్ రెండో లాంచ్ పాడ్ నుంచి ప్రయోగించిన 75 నిమిషాల తర్వాత దీనిలోని అన్ని (36) శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యలలోకి పంపించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ఔజీస।నిటసజీ ఓనీటతి) అందజేసిన సహకారం వల్ల ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. చారిత్రాత్మక కార్యక్రమం కోసం అవకాశాన్ని అందిపుచ్చుకుని, నేటికి దానిని సిద్ధం చేసిన లాంచ్ వెహికిల్ బృందానికి అభినందనలు తెలిపారు. పం3ని ప్రయోగించే విషయంలో ఇస్రోపై నమ్మకం ఉంచిన వన్‌వెబ్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి మిషన్‌లో కాంట్రాక్ట్‌కు ఇచ్చిన మిగిలిన 36 ఉపగ్రహాలను కూడా ఇదే విధంగా విజయవంతంగా ప్రయోగించగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!