న్యూఢల్లీి,అక్టోబర్ 22 (ఆంధ్రపత్రిక): దేశ వ్యాప్తంగా రానున్న 18 నెలల కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రోజ్ గార్ మేళాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మొదటి దశలో ఎంపికైన 75,226 మంది యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్ల కాలంలో యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చామన్నారు. రోజ్ గార్ మేళా ద్వారా ఏడాడిన్నర కాలంలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ యువతకు వివిధ రంగాల్లో ఎన్నో అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తమ సంకల్పంలో నూతన ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, రైతులు అంతా భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశంలో యువశక్తి గణనీయంగా ఉందన్నారు. దేశంలోని యువతకు ఈరోజు ఎంతో ముఖ్యమైనదన్నారు. ఈరోజు కేంద ప్రభుత్వం 75వేల మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించిందన్నారు. ముద్రా యోజన కింద బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు రుణాలిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర తెలిపారు. రూ.20 లక్షల వరకు ఈ పథకం ద్వారా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలిస్తున్నాయని, వారు స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంకు రుణాలు దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. కరోనా సమయంలో కూడా సూక్ష్మ, మధ్య తరహా సంస్థలను కేందప్రభుత్వం ఆదుకుందన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశంలో తయారీ పరిశ్రమలకు ఊతమిచ్చినట్లు తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో స్టార్టప్‌ల సంఖ్య పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 2014 వరకు దేశంలో స్టార్టప్‌లు కొన్ని మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 80 వేలు దాటిందన్నారు. ఖాధీ, గ్రావిూణ పరిశ్రమల ద్వారా గ్రామాల్లో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏడు నుంచి ఎనిమిదేళ్ల కాలంలో 10 నుంచి 5వ స్థానానికి చేరుకున్నామన్నారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద దేశంలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి మేళా కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు కేందప్రభుత్వం ఎప్పటికప్పుడు నియామక పత్రాలను అందజేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో పది లక్షల ఉద్యోగాలను రానున్న 18 నెలల్లో కల్పించడమే లక్ష్యంగా కేందప్రభుత్వం రోజ్ గార్ మేళాకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొదటగా అక్టోబర్ 22వ తేదీ శనివారం 75 వేల మందికి జాబ్ ఆఫర్ లెటర్స్ అందించారు. ముందు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 38 డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేందప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రక్షణ, రైల్వే, హోం, పోస్టల్ డిపార్ట్మెంట్, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొదటి దేశలో దేశ వ్యాప్తంగా 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందిన యువతకు కేంద్ర మంత్రులు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 50 కేంద్రాలలో అపాయింట్మెంట్ లెటర్ల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, విజయవాడలో రోజ్‌గార్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో 8 కేంద్ర శాఖల్లో 303 మందికి ఉద్యోగాలు కల్పించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ ఉద్యోగ నియమాక పత్రాలను అందజేశారు. 218 మందికి నేరుగా.. 85 మందికి వర్చువల్‌గా అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!