కాగ్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల
న్యూఢల్లీి,అక్టోబర్ 21 (ఆంధ్రపత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిందే తప్ప ఆయకట్టు పెరగలేదని ఆరోపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢల్లీి పర్యటనలో బిజీగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కాగ్‌కు షర్మిల ఫిర్యాదు చేశారు. శుక్రవారం కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గిరీష్ ముర్మును వైఎస్సార్టీపీ అధినేత్రి కలిశారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కాగ్‌ను షర్మిల కోరారు. కాళేశ్వరంగా ప్రాజెక్టు అంచనాను లక్షా 20 వేల కోట్లకు పెంచడంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కాగ్ అధికారులను కోరారు. కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలపై తన వద్ద ఉన్న ఆధారాలను షర్మిల కాగ్‌కు అందజేశారు. కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ హస్తం ఉందన్న ఆమె.. రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం అన్ని ప్యాకేజీల్లో అవినీతి జరిగిందని దీనిపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌కి అన్ని ఆధారాలు సమర్పించినట్లు చెప్పారు. ఇరిగేషన్, ఐఐటీ నిపుణులతో కలిపి స్వతంత్ర దర్యాప్తు జరుపుతామని కాగ్ హావిూ ఇచ్చారని అన్నారు. మేఘ కంపెనీ చేపట్టే ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని షర్మిల ఆరో పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే సీబీఐకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశంలోనే అతిపెద్ద కుంభ కోణమని షర్మిల అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రజలు బహిష్కరించాలని షర్మిల పిలుపునిచ్చారు. ఇది వచ్చిన ఎలక్షన్ కాదు, తెచ్చుకున్న ఎన్నిక అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మునుగోడు బైపోల్ తీసు కొచ్చారని షర్మిల మండిపడ్డారు. వివేకా హత్య కేసు దర్యాప్తుపైనా షర్మిల స్పందించారు. సుప్రీంకోర్టు ఆ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. సీబీఐ దర్యాప్తులో అన్ని విషయాలు బయ టకు వస్తాయన్న షర్మిల.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.