న్యూఢల్లీి,అక్టోబర్ 21 (ఆంధ్రపత్రిక): ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు ఊరట లభించింది. విమానాలను నడిపే విషయంలో ఆ సంస్థపై విధించిన పరిమితిని డీజీసీఏ ఎత్తివేసింది. శీతాకాల షెడ్యూల్లో పూర్తి స్థాయిలో విమానాలను నడిపేందుకు వీలు కల్పించింది. స్పైస్ జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు వెలుగు చూడడంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దీంతో 50 శాతం సర్వీసులనే నడపాలంటూ జులై 27న ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌లో మరోసారి ఆ ఆంక్షలను పొడిగించింది. తాజాగా ఆ పరిమితిని తొలగించింది.మరోవైపు అక్టోబర్ 30 నుంచి వచ్చే మార్చి 25 వరకు గల శీతాకాల షెడ్యూల్‌ను డీజీసీఏ ప్రకటించింది. ఈ షెడ్యూల్లో వారానికి దేశీయంగా 21,941 విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలకు అనుమతి మంజూరు చేసింది. 105 విమానాశ్రయాల నుంచి ఈ రాకపోకలు జరగనున్నాయని తెలిపింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఆ సంఖ్య 1.55 శాతం తక్కువ కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో వారానికి 22,287 విమానాలు నడిపేందుకు డీజీసీఏ అనుమతి ఇచ్చింది. తాజా షెడ్యూల్లో ఇండిగో గరిష్ఠంగా వారంలో 10,085 విమానాలను, స్పైస్‌జెట్ 3,193 విమానాలను నడపనుంది. ఎయిరిండియా (1,990), విస్తారా (1,941), ఎయిర్ ఏషియా (1,462), గో ఎయిర్ (1,390), అలయన్స్ ఎయిర్ (1,034), ఆకాశ ఎయిర్ (479), ఫ్లై బిగ్ (214), స్టార్ ఎయిర్ (153) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!