గాంధీనగర్, అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఫెన్స్ ఎక్స్ పో 2022 బుధవారం ప్రారంభించారు. గుజ రాత్లోని గాంధీనగర్లో ఢఫిెన్స్ ఎక్స్ పో నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చూట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గాంధీనగర్లో డిఫెన్స్ ఎక్స్పో 2022ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర గుజరాత్లోని దీసాలో కొత్త ఎయిర్ బేస్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక అంటూ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ ఉత్పత్తి సామర్ద్యాలను ప్రదర్శించడం దీని ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఎక్స్ పోలో కేవలం భారతదేశానికి చెందిన కంపెనీలు మాత్రమే పాల్గొంటున్నాయని.. మన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. దీనిలో భారత్ సరికొత్త ముఖచిత్రం కనిపిస్తుందన్నారు. సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం చాలా ముందుకు వచ్చిందని.. ఇంతకు ముందు పావురాలను విడిచిపెట్టాం.. ఇప్పుడు చిరుతలను వదులు తున్నామంటూ పేర్కొన్నారు. దిగుమతి కోసం నిషేధించబడే 101 వస్తువుల జాబితాను విడుదల చేయడానికి రక్షణ దళాలు సన్నాహాలు చేశాయన్నారు. దీనితో 411 రక్షణ సంబంధిత వస్తువులను స్థానికంగా కూడా కొనుగోలు చేయవచ్చవచ్చ న్నారు. భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గత ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు పెరి గాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇందులో దేశాభివృద్ధి, రాష్టాల్ర భాగస్వామ్యం, యువత కలలు కూడా ఉన్నా యని తెలిపారు. మొట్టమొదటిసారి భారత నేలలో రక్షణాయుధాలు తయారయ్యాయని తెలిపారు. మన దేశ కంపె నీలు, శాస్త్రవేత్తలు, యువత శక్తి, సర్దార్ పటేల్ గడ్డ నుంచి ఈరోజు మన సత్తా ప్రపంచానికి చాటిచెబుతున్నామని పేర్కొన్నారు. ఇక్కడ తొలిసారిగా 450కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!