హైదరాబాద్,అక్టోబర్ 14 (ఆంధ్రపత్రిక): ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. పేద, మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తరు.. కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా..? రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100 ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయిల్ కంపెనీలకు కాదు. ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ఇవ్వాలి స్పెషల్ ప్యాకేజీలు అన్నారు. సిలిండర్ భారాన్ని మూడిరతలు చేసి, ఇప్పుడు మూడు సిలిండర్ల జపం చేస్తారా మూడు సిలిండర్లతో మూడు పూటలా వంట సాధ్యమా..? ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం..!! ఆడబిడ్డలపై ఆర్థిక భారమా..? ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా..? గరీబోల్ల గుండెలపై మోయలేని గుదిబండలు.. ఈ గ్యాస్ బండలు. మహిళా లోకానికి అర్థమైంది, మోయలేని భారం మోపే వాడే, మోడీ. అని ట్వీట్ చేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!