అభివృద్ధి కి ప్రణాళికలు సిద్ధం చేయాలని జె ఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశం
తిరుపతి,అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న టీటీడీ పాత హుజూర్ ఆఫీసు భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిగణించాల్సిన అవసరం ఉందని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు.
శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వెనుక వైపున గల పాత హుజూర్ ఆఫీసుతో పాటు, మ్యూజియం ను గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పాత హుజూర్ ఆఫీసు భవనాలను సంరక్షించి సంగీత, నృత్య కళాశాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మ్యూజియం భవనంలో శిల్ప కళాశాలకు చెందిన పురాతన శిల్పాలు, ఇతర చారిత్రక శిల్పాలు ఉంచేందుకు అవసరమైన విధంగా మరమ్మతులు చేయాలన్నారు.
చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, డిఈవో శ్రీ గోవింద రాజన్, విద్యుత్ విభాగం
ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఎఈవో
శ్రీ మునిరత్నం, సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.