4న విడుదలకు సన్నాహాలు
అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): ’ధడక్’ లాంటి శాడ్ ఎండిరగ్ లవ్‌స్టోరీతో కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత కూడా డిఫరెంట్ కాన్సెప్టుల్ని, చాలెంజింగ్ క్యారెక్టర్స్‌నే ఎంచుకుంటూ వస్తోంది. ’గుంజన్ సక్సేనా’లో రియల్ లైఫ్ రోల్ పోషించింది. ’రూహీ’లో డ్యూయెల్ రోల్ చేసింది. ’గుడ్‌లక్ జెర్రీ’లో స్మగ్లర్‌గా కనిపించింది. ఈసారి ఒక సర్వైవల్ థ్రిల్లర్‌తో పలకరించబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళ సూపర్ హిట్ ’హెలెన్’ ఆధారంగా బోనీకపూర్ నిర్మిస్తున్న ’మిలీ’లో టైటిల్ రోల్ పోషిస్తోంది జాన్వీ. ఒరిజినల్ తీసిన ముత్తుకుట్టి జేవియర్ హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ టీజర్‌ను వదిలారు. విదేశాలకు వెళ్లి జాబ్ చేయాలనేది మిలీ గోల్. నర్సింగ్ పూర్తి చేస్తుంది. ఫారిన్ వెళ్లడానికి అవసరమైన పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటూ ఓ రెస్టారెంట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి అనుకోకుండా కోల్డ్ స్టోరేజ్‌లో ఇరుక్కుపోతుంది. అక్కడి నుంచి బయటపడే దారి లేక చలిలో నానా అవస్థలూ పడుతుంది. ఐదు గంటల పాటు ఆమె అనుభవించే స్టగ్రులే ఈ సినిమా. అందుకు సంబంధించిన విజువల్స్‌తో కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. మిలీగా జాన్వీ లుక్ బాగుంది.
క్షణక్షణం చావుకు దగ్గరవుతూ బతకాలని ఆరాటపడే అమ్మాయి పాత్ర ఇది. ఒరిజినల్లో అద్భుతంగా నటించిన ఆనా బెన్ని చాలా అవార్డులు వరించాయి. అందుకే దీన్ని చాలెంజింగ్‌గా తీసుకుంది జాన్వీ. ఫారిన్ వెళ్లి మరీ చలిని తట్టుకోవడానికి శిక్షణ తీసుకుంది. మరి మిలీగా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.