తిరుమల,అక్టోబర్ 12 (ఆంధ్రపత్రిక): శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చందగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయ నున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు బ్రేక్ దర్శనం, శ్రీవారి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ నెల 25న మంగళవారం సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటలకు సూర్యగ్రహణం సంభవించనున్నది. ఈ కారణంగా ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసి వేయనున్నారు. అనంతరం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. నవంబర్ 8న చందగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చందగ్రహణం ఏర్పడనుండగా.. ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను మూసి ఉంచుతారు. గ్రహణం నేపథ్యంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు భక్తులు గమనించి, తిరుమల యాత్రకు రావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!