అక్టోబర్ 11 (ఆంధ్రపత్రిక): మెగాస్టార్ చిరంజీవి మాస్ అప్పీరియన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అన్నయ్యకి మెగా ఇమేజ్ ని తీసుకొచ్చింది తనలో ఆ మాస్ అప్పీరియన్స్ అన్నది సుస్ప షం. 90 స్లో బాక్సాఫీస్‌ని ఆ మాస్ లుక్ తోనే రప్ఫాడిరచే సేవారు. కాలక్రమంలో ట్రెండ్‌కి తగ్గట్టు సినిమాలు చేసుకుంటూ రావడంతో నెమ్మదిగా మాస్ అప్పీరియన్స్కి దూరమయ్యారు. ఇక కంబ్యాక్ తర్వాత చిరు ఎంపికల విధానం పూర్తిగా మారిపో యింది. ‘ఖైదీనంబ ర్ 150’..’సైరా నరసింహారెడ్డి’…’..ఆచార్య’ లో క్లాసీ టచ్ ఉన్న పాత్రలే చేసారు. అన్నయ్యలో ఆ వ్యత్యాసాన్ని గమనించి యంగ్ మేకర్ బాబి ఒకప్పటి చిరంజీవిని మళ్లీ తెరపై ఆవిష్కరించాలని నడుం బిగించారు. తన అభిమానమంతా సినిమాలో కనిసిస్తుందని ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే హిట్ ఇచ్చేసారు. మెగాస్టార్ ని అసలైన అభిమానులు తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో? అంతకు మించి కనిపిస్తారని సంకేతాలు పాస్ పాస్ చేసారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్ తోనే కంటెంట్‌లో మాస్ కోణం తెలుస్తుంది. ఇందులో చిరు వీరయ్య అనే పాత్రలో కనిపించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే పక్కా మాస్ చిత్రమిది. దీంతో వీరయ్య పాత్రలో చిరు ఎలా కనిపిస్తారు? అని ఒకటే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. సాక్షాత్తు చిరు నోట మాట మరింత సంచలనంగా మారింది. తాజాగా సినిమాలో చిరు మాస్ లుక్ ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది. చిరు ఆహార్యం ఆద్యంతం మాస్ ని తలపిస్తుంది. చేతిలో స్మార్ట ఫోన్..చేతికి కాశీ తాడులు..వేలికి ఉంగరాలు..కాస్ట్యూమ్స్ …చిరు సిట్టింగ్ స్టైల్..ఫేస్‌లో ఎక్స్ ప్రెషన్ అన్ని మాస్లో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!