గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కంప్యూటర్ సేవలు
అమరావతి,అక్టోబర్10(ఆంధ్రపత్రిక): 2021`22లో దేశవ్యాప్తంగా ఈ`గవర్నెన్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్`10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయని నివేదిక వెల్లడిరచింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కార్యక్రమాలన్నింటినీ కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తూ ప్రత్యేక డిజిటల్ కార్యదర్శులను నియమించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల వరకు పరిపాలన ఎలక్టాన్రిక్ లావాదేవీలు జరిపింది. ఎలక్టాన్రిక్ లావాదేవీల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అన్ని సేవలను అందిస్తోంది. నవరత్నాల్లో పథకాల లబ్దిదారులందరికీ ఎలక్టాన్రిక్ పద్ధతిలో నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఈ లావాదేవీలను సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరిస్తూ ఈ`గవర్నెన్స్‌లో ఏపీ నాలుగో స్థానం సాధించిందని నివేదిక వెల్లడిరచింది. అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్టాన్రిక్ లావాదేవీలతో పశ్చిమబెంగాల్ మొదటి స్థానంలో ఉండగా, 109.27 కోట్లతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 84.23 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయని నివేదిక వెల్లడిరచింది. అదే విధంగా ఆంధప్రదేశ్‌లో 52.90 కోట్ల ఎలక్టాన్రిక్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. నివేదిక ఎలక్టాన్రిక్ సేవల లావాదేవీలను చట్టబద్దతమైన, చట్ట బద్దత లేని సేవలు, వ్యాపార పౌర సేవలు, సమాచార సేవలు, మొబైల్ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలు వంటి ఆరు విభాగాలుగా వర్గీకరించింది. ఏపీ 52.90 కోట్ల ఎలక్టాన్రిక్ సేవల లావాదేవీలు నిర్వహించినట్లు నివేదిక వెల్లడిరచింది.