- రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత కెసిఆర్‌దే
- బిఆర్‌ఎస్ జాతీయపార్టీపై నిర్మలాసీతారామన్ విమర్శలు
- కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు
- ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదు
- నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో టీఆర్‌ఎస్ విఫలమైంది
- తెలంగాణానే మర్చిపోతున్న టీఆర్‌ఎస్ దేశానికి ఏం చేస్తుంది
- 2014 నుంచి 2018 వరకు మహిళలకు రాష్ట్ర కేబినెట్‌లో చోటు ఇవ్వలేని తెలంగాణ…
- ప్రతిపక్షాల డిమాండ్‌తోనే మహిళలకు మంత్రి వర్గంలో చోటు..
- మంత్రాలు, తంత్రాలకు భయపడి కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదు
న్యూఢల్లీి,అక్టోబర్ 8 (ఆంధ్రపత్రిక): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ను ఇటీవల బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దేశ రాజకీయాలు చర్చనీ యాంశంగా మారాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌తో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేక పోయారని ఆక్షేపించారు. నియామకాలన్న కేసీఆర్ రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని నిర్మలా సీతారామన్ అయ్యారు. తెలంగాణనే మర్చిపోతున్న టీఆర్‌ఎస్ దేశానికి ఏం చేస్తుందని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు మహిళలకు రాష్ట్ర కేబినెట్‌లో చోటు ఇవ్వలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చాక కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షాల డిమాండ్‌తో మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు. మహిళలను మంత్రివర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతో మహిళ లకు అవకాశం కల్పించలేదు. మంత్రాలు, తంత్రాలకు భయపడి కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదని నిర్మలా సీతారామన్ అన్నారు.