- వారసుడిని గుర్తించాలంటూ జస్టిస్ ఉమేశ్ లలిత్‌కు లేఖ
- తదుపరి చీఫ్ జస్టిస్‌గా డివై చంద్రచూడ్‌కు అవకాశాలు
- నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సిజెఐ
- ఆర్టికల్ 124(2) ప్రకారం సీజేఐ నియామకం
న్యూఢల్లీి,అక్టోబర్ 7 (ఆంధ్రపత్రిక) : తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని కోరుతూ.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌కు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. తదుపరి సీజేఐ ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. 50వ సీజేఐగా ఎవరికి అవకాశం ఇవ్వాలో సూ చించాలని కోరుతూ జస్టిస్ లలిత్‌కు లేఖ రాసింది. ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్లిత్ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. సాధారణంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి సూచించే పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉంటుంది. జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తి ఆగస్టు 26న పదవీ విరమణ చేశారు. ఆగస్టు 27న సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం దాదాపు 3 నెలలే. మరో నెల రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తదుపరి సీజేఐ నియామక పక్రియ ప్రారంభించింది. భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా ఎవర్ని నియమిస్తారో చెప్పాలంటూ లలిత్‌కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం లేఖ రాసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐని నియమించాలని ఆయన ఆ లేఖలో కోరారు. సీనియార్టీ ప్రకారం జస్టిస్ డీవై చంద్రచూడ్ తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత సీజే లలిత్ తర్వాత ఆయనే సుప్రీంలో సీనియర్ జస్టిస్. జస్టిస్ చంద్రచూడ్ పేరును సీజే లలిత్ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ చంద్రచూడ్ చాలా రోజులు సీజేఐ పదవిలో ఉండే ఛాన్సు ఉంది. ఒకవేళ చంద్రచూడ్ సీజేఐగా నియామకం చెందితే .. అప్పుడు ఆయన 2024, నవంబర్ 10వ తేదీన రిటైర్ అవుతారు. అంటే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం సీజేఐ నియామకం జరుగుతుంది. దాని ప్రకారమే కేంద్ర న్యాయ శాఖ మంత్రి .. ప్రస్తుత సీజేఐకి లేఖ రాయడం జరిగింది. మరో వైపు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నాలుగు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ వారసుడిని సీజేఐ ప్రకటిస్తే, అప్పుడు ఆ పోస్టులను నింపేందుకు జస్టిస్ లలిత్ కొలీజియం విూటింగ్‌ను నిర్వహించడం వీలుకాదు. రిటైర్మెంట్కు నెల రోజుల దూరంలో ఉన్న జస్టిస్ లలిత్.. ఎటువంటి కొత్త అపాయింట్లను ఇవ్వడం కుదరదు.