విజయవాడ, అక్టోబర్ 7 (ఆంధ్రపత్రిక): ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ది.26.09.2022వ తేదీ నుండి 05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతులను పురస్కరించుకుని పూర్ణాహుతి మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ది.07.10.2022వ తేదీన విజయవాడ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వన్ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను పది రోజులు పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించగా, దసరా ముగింపు కార్యక్రమానికి ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ శ్రీ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారు ముఖ్య అతిధిగా విచ్చేసి, వేద పండితులు నిర్వహించిన హోమంనందు పూర్ణాహుతిని సమర్పించి, దసరా మహోత్సవాలకు ముగింపు పలకడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. గారితోపాటు డి.సి.పి. శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్. గార్లతో పాటు, పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సి.పి. శ్రీ కొల్లి శ్రీనివాస్ గారు, అడ్మిన్ ఇన్ ఛార్జ్ డి.సి.పి. శ్రీమతి పి.వెంకటరత్నం గారు, ఎస్.బి.ఏ.డి.సి.పి. శ్రీ సి.హెచ్.లక్ష్మీపతి గారు, ఎస్.ఈ.బి. అడిషనల్ ఎస్.పి. శ్రీ సత్తిబాబు గారు, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. శ్రీ సర్కార్ గారు, పశ్చిమ ఏ. సి.పి. డా. కే.హనుమంతరావు గారు, ఏ.సి.పి.లు, వన్ టౌన్ ఇన స్పెక్టర్ శ్రీ పి. వెంకటేశ్వర్లు మరియు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.